80 రోజుల్లో భూప్రదక్షణ కథ
ఇంట్రడక్షన్:
80 రోజుల్లో భూప్రదక్షణ అనే అద్భుతమైన, సాహసోపేతమైన నవల. ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులని సంపాదించు కుంది. ఈ నవల భూగోళ శాస్త్రం తో పాటుగా ఎన్నో సాహస కృత్యాలతో ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రస్తుతం మన బాలసాహిత్యంలో ఇటువంటి విజ్ఞాన పరమైనవి, పిల్లలలో పుస్తక పఠనంలో ఆసక్తిని కలిగించేవి లభ్యం కావటం లేదు. అందుకని ఈ నవలని తెలుగు పాఠకులకి, చిన్నలకీ పెద్దలకీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో అక్షర తెలుగులో అనువాదం చేయటం జరిగింది.
80 రోజుల్లో భూప్రదక్షణ కథ
Chapter 1
పాత్రలు పాత్రధారులు (Characters)
ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత: జల్పైవేర్నే (Mr జల్పైవేర్నే_)
హీరో: ఫిలియాస్ ఫాగ్ (Mr. Philias Fog)
సర్వెంట్: జోన్ పాస్పర్ట్ (Mr. Jone Paspert)
హీరోయిన్: ఔదా (Ms. Ayvdha)
డిటెక్టివ్: ఫిక్స్ (Mr Fix)
రిఫార్మ్స్ క్లబ్: ఆండ్రూ స్టువర్ట్ (Mr. Andrew Stuart)
షిప్ నేమ్స్: (Ships Name)
మంగోలియా ఫ్రొం ఇటలీ టు బొంబాయి
(Mangolia from Italy to Bombay)
బొంబాయి టు హొంగ్ కాంగ్ షిప్: కానాటికా
(బొంబయి to Hong Kong ship Caunatica)
హాంకాంగ్ అండ్ యొకహోమా
(Hongkong and Yokohama)
ముందుగా ఈ కథలోని ముఖ్య పాత్రలగురించి మాట్లాడుకుందాం. ఈయన పేరు ఫిలియాస్ ఫాగ్. ఈయన బ్రిటిష్ పౌరుడు. 7 Savel రోడ్ సెంట్రల్ లండన్ లో ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు. మనిషి చాలా క్రమ శిక్షణతో చాలా కచ్చితంగా ఉంటాడు. అందరికీ కూడా ఫిలియాస్ ఫాగ్ అంటే ఎంతో గౌరవం. ఇతను చాలా ధనవంతుడు. కానీ ఈ ధనం ఎంత సంపాదించాడో, ఎలా సంపాదించాడో అన్నది ఎవరికీ తెలియదు. ఇతనికి నా అన్న వారు ఎవరూ లేరు. స్నేహితులు గానీ, బంధువులుగానీ ఎవరూ లేరు. ఖరీదైన సెంట్రల్ లండన్ లో ఈయన నివసిస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఈయన తప్పనిసరిగా రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఈ క్లబ్ లోనే అన్నీ న్యూస్ పేపర్లు చదువుతూంటాడు .
అలాగే పేకాట కూడా ఆడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఏ ప్రదేశానైనా సరే, అక్కడి అద్భుతాలన్నీ ఈయన ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాడు. అయితే, అతనికి అందరూ తెలిసిన వాళ్ళు కూడా ఏదో ఒకప్పుడు, ఈయన ఆ ప్రాంతానికి తప్పక వెళ్లి ఉంటారు, ఖచ్చితమైన వివరాలు ఇస్తున్నారు కదా అని అంటారు. యింకా బాగా తెలిసిన వాళ్ళు, అదేంటి మేము ఎన్నో ఏళ్ళనుంచి ఈయనని ఎరుగుదుము. ఈయన ఎప్పుడూ ఇంగ్లండును వదిలి వెళ్లనే లేదు, అని, వాదిస్తూ ఉండేవాళ్ళు. బహుశా, ఈయన తన మెదడులోనే ఇన్ని ప్రదేశాలకి ప్రత్యక్షంగా వెళ్లి ఉంటారేమో అని ఇంకొకళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ గురించి అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటారు. కానీ అతను చాలా వ్యక్తిగతంగానే ఉంటాడు. అంటే, ఒంటరిగానే ఉంటాడు. స్నేహితులంటూ, బంధువులంటూ ఎవరూ లేరు. ఇంట్లో ఒక పనిమనిషి మాత్రమే ఉంటాడు. అన్నీ పనులూ ఈ పనివాడు చేస్తూ ఉంటాడు.
గడియారంలో ముల్లు ఎంత క్రమ బద్ధంగా క్రమ శిక్షణగా తిరుగుతూ ఉంటాయో, ఒక్క సెకండ్ కూడా అటూ ఇటూ కాకుండా తిరుగుతూ ఉంటాయో, ఈ ఫిలియాస్ ఫాగ్ కూడా అంత క్రమ శిక్షణ కలిగి ఉంటాడు. ప్రతీ రోజూ ఏ సమయంలో ఏ పని చేస్తారో అదే సమయంలో అదే పని ఒక్క సెకండ్ అటూ ఇటూ తేడా లేకుండా అలాగే తూచా తప్పకుండా అదే విధంగా ఈ ఫిలియాస్ ఫాగ్ ఆచరిస్తూ ప్రవర్తిస్తూ దినచర్య ని ఖచ్చితముగా పాటిస్తూ ఉంటాడు. ఇది ఈయనని గురించి చాలా మంది చేసినటువంటి విశ్లేషణ.
అయితే, ఒకరోజు పనిమనిషి ని పనిలో నించి తొలగించడం జరిగింది. ఎందుకంటె షేవింగ్ చేసుకునే నీళ్లు, మామూలు వేడి కంటే ఎక్కువగా ఉన్నాయనే విషయంలో, ఆ పనివాడు తప్పుచేసాడని, అతనిని ఉద్యోగంలోంచి ఫిలియాస్ ఫాగ్ తొలగించాడు. మరి ప్రస్తుతం ఆయనకు రాబోయే కొత్త పనివాడి కోసం, పేరు సర్వెంట్ జోన్ పాస్పర్ట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ప్రొద్దున్న పదకొండు, పదకొండున్నర మధ్యలో ఈయన ఆపాయిట్మెంట్ యివ్వడం జరిగింది. మాటిమాటికీ గడియారం చూసుకుంటూ ఉన్నాడు ఫిలియాస్ ఫాగ్. ఎందుకంటె ఖచ్చితంగా పదకొండు గంటల ముపై నిముషాలికిఆయన ఇంట్లోంచి బయలుదేరి, రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ఈలోగా, అప్పుడే ఎవరో వచ్చినట్టుగా తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది. ఎవరబ్బా అని బహుశా సర్వెంట్ జోన్ పాస్పర్ట్ అయి ఉంటాడని తలుపు తెరవగానే ఎదురుగా ముప్పై ఏళ్ళ ఆకర్షణీయంగా ఉన్న యువకుడు ఫిలియాస్ ఫాగ్ కి అభివాదం చేసాడు. నా పేరు జోన్ పాస్పర్ట్ అని అతను పరిచయం చేసుకునే లోగానే, ఫిలియాస్ ఫాగ్ గారు మరి జాన్ అంటే బ్రిటిష్ వారి పేరు కదా? మరి నీవు ఫ్రెంచ్ వాడివి అంటున్నావు, మరి ఏమిటి విశేషం అంటే, నా పేరు జోన్ పాస్పర్ట్, జాన్ కాదండీ. నేను ఫ్రెంచ్ వాడినే, అన్నాడు.
కొన్నాళ్ళు నేను ఫిసికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెషనల్ ఇన్స్ట్రక్టర్ గా పనిచేసాను. కొన్నాళ్ళు సంగీత అభ్యాసం చేసాను. పాటలు పాడే వాడిని. కొన్నాళ్ళు పారిస్ లో ఫైర్ బ్రిగేడ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసానుయ్. కొన్నాళ్ళు సర్కస్ లో కూడా గుర్రపు స్వారీ చేస్తుండే వాడిని. కానీ, పనివాడిగా నా జీవితంలో నేనెప్పుడూ పని చేయలేదు. మీ గురించి నా మిత్రుడు ఎంతో గొప్పగా చెప్పాడు. మొత్తం లండన్ లో మీ అంత పెద్దమనిషి ఉండరని, క్రమశిక్షణకు మారుపేరని, నిక్కచ్చిగా ఉంటారని, యుఇలా మీ గురించి ఎన్నోవిషయాలు, నాకు ఆయన చెప్పారు. నేను ఇప్పటివరకు స్థిరం లేకుండా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేసాను. మీ సంగతి విన్నాక ఇక్కడ మీ దగ్గర ప్రశాంతంగా పనివాడుగా చేరదామని అనుకున్నాను. కానీ నేను పనివాడుగా ఇంతవరకూ పని చేయలేదండీ. నాకు మాత్రం ఆ అనుబుగ్గవం లేదు, అని గబగబా తనకి తెలిసిన విషయాలు చెప్పేసాడు.
ఓహో, అలాగా, నా రిఫార్మ్స్ క్లబ్ లో న మిత్రుడు నీ గురించి చెప్పాడు. నువ్వు ఫ్రెంచ్ దేశస్తుడని చాలా మర్యాదస్తుడవనీ, నాకే సరిగా సరిపోయే మనిషి అని, నాకు చెప్పడం జరిగింది, అని ఫిలియాస్ ఫాగ్ సమాధానమిచ్చాడు.
ఫిలియాస్ ఫాగ్ కి ఎలాంటి పనివాడు కావాలో అని చెప్పబోయే సరికి, సర్వెంట్ జోన్ పాస్పర్ట్ నాకు అంతా అర్ధమయింది, అని చెప్పాడు.
సరే యిప్పుడు టైం ఎంతైంది? అనే అడగ్గా, జోన్ పాస్పర్ట్ తన జేబులోంచి చిన్న గడియారాన్ని తీసి పదకొండు గంటల ఇరవై రెండు నిముషాలు అయిందని చెప్పాడు. నాలుగు నిముషాలు లేటుగా ఉంది. సరే నువ్వు పదకొండు గంటల ఇరవై ఆరు నిముషాల నుంచి ఈ ఉద్యోగంలో చేరినట్టుగా లెక్క. సరే. నేను వెళతాను, అనిచెప్పి సరిగ్గా పోయేదకొండు గంటల ముప్పై నిముషాలకి, నెత్తిమీద టోపీ పెట్టుకొని ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
చాలా క్లుప్తంగా జరిగాయి పరిచయాలు.
జోన్ పాస్పర్ట్ మనసులో ఆయన గురించి ఈ విధంగా అనుకున్నాడు. ఈ మనిషిమ్, ఒడ్డూ పొడుగూ చాలా అందంగా ఉన్నాడు. కళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చాలా గౌరవంగా ఉన్నాడు. చాలా కలుపటంగా జరిగింది ఆయనతో మాట్లాడటం. ఈయన చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. ఈయన హావభావాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. బహుశా బ్రిటిష్ వారంతా ఇలాగే ఉంటారు కాబోలు. అతను ఏమి ఆలోచిస్తాడో మనకి ఏమీ తెలియదు కానీ, బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతను నాకు తగిన యజమాని అని అనుకున్నాడు. ఇక్కడైనా నేను హాయిగా ప్రశాంతంగా ఉంటాను, నమ్మకస్తుడిగా ఉంటాను, అని జోన్ పాస్పర్ట్ అనుకుంటాడు.
ఇక జోన్ పాస్పర్ట్ గురించి మాట్లాడుకుందాం. జోన్ పాస్పర్ట్ ముప్పై ఏళ్ళవాడు. ఆకర్షణీయమైన మొహాన్ని కలిగి ఉన్నాడు. చాలా బలిష్టంగా ఉన్నాడు. నీలి జుట్టు మాత్రం కొంచం చిందర వందరగా ఉంటుంది. జోన్ పాస్పర్ట్ ముందుగా ఆ యింటినంతా ఒక్కొక్క గదిలోకి వెళ్లి పరీక్షించాడు. అంతా చాలా శుభ్రంగా అమర్చినట్లుగా ఉంది. అంతా అయినాక తన గదిలోకి వచ్చాడు. తన గది కూడా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ ఓకే పెద్ద గడియారం ఉంది. ఈ గడియారం కి సెకండ్ల ముల్లు చాలా పెద్దగా ఉంది. ఈ రెండు గడియారాలు ఖచ్చితమైన సమయాన్నే సూచిస్తూ ఉన్నాయి
మెడమీద ఒక కాగితం అంటించబడి ఉంది. దానిపై జోన్ పాస్పర్ట్ దిన చర్య అంతా రాయడం జరిగింది. దానిని చూసుకుంటూ తన పిన్నిని తాను నిర్వహిస్తూ ఉండాలి. అంటే ఫిలియాస్ ఫాగ్ గారు ఎన్నింటికి లేస్తారు. నీళ్ల ఉష్ణోగ్రత ఎంత ఉండాలి. ఎన్నింటికి బ్రేక్ ఫాస్ట్ చేజేస్తారు. ఎన్నింటికి ఇంట్లోంచి బయిటికి వెళతారు. మళ్ళీ ఎన్నింటికి వస్తారు. యివన్నీ కూడా వివరంగా అక్కడ రాసి ఉన్నాయి. జోన్ పాసోపేర్ట్ కి చాలా సంతోషం వేసింది. ఈ మనిషి గడియారంలాగా ఖచ్చితంగా బాగా పని చేస్తూ ఉంటాడు. కాబట్టీ నేను అసలు సిసలైన యజమాని దగ్గరికే వచ్చాను, అని అతను ఎంతో సంతోషపడ్డాడు.
ఫిలియాస్ ఫాగ్ గారు చాలా ఖచ్చితంగా ఉంటాడని మనం చెప్పు కున్నాం కదా. అంటే సరిగా పదకొండు గంటల ముప్పై నిముషాలకి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ముందుగా ఎడమ పాదం పెడ్తారు. అది 575 సార్లు అయ్యేసరికి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఆ తరువాత 575 సార్ల తర్వాత కుడి పాదం పెట్టె సరికి, రిఫార్మ్స్ క్లబ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆయన చేరుతారు. అక్కడ ఆయన పదమూడు నిముషాలు తక్కువగా ఒంటిగంటకు అక్కడే మధ్యాహ్నం భోజనం అదే టేబుల్ మీద కుర్చీలో కూర్చుని ఆయన భోజనం చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న లైబ్రరీ లో పుస్తకాలు, మాగజైన్లు చదువుతూ ఉంటారు. సరిగా ఐదు గంటలకి ఆయన టీ సేవిస్తారు. ఆ తరువాత పది నిముషాల తక్కువ ఆరు గంటలకి రిఫార్మ్స్ క్లబ్ లో పేకాట ఆడే గదిలోకి ప్రతీ నిత్యం తాను కూర్చునే టేబుల్ కుర్చీ దగ్గర ఆయన కూర్చుంటారు. పేకాట ఆడినపుడు వచ్చే డబ్బుని, విరాళంగా పంచి ఇచ్చేస్తాడు
About the Author
Mantri Pragada Markandeyulu is an Indian author, poet, novelist, lyricist, and composer known for his prolific writing across multiple genres including fiction, non-fiction, educational, and literary works. He is a retired officer from a public sector undertaking (PSU) and resides permanently in Hyderabad, Telangana, India. He has authored around 50 Kindle eBooks and is recognized for his micro-poetry and short stories. He holds degrees such as Bachelor of Commerce and diplomas in business management and computing, and he has earned honors such as Litt.D. His contributions also include songs and stories, and he has achieved recognition in literary circles including records and awards.